హత్యల వెనుక మిస్టరీ చేదించనున్న సీనియర్ హీరో

ఈ మధ్యనే ‘పిఎస్వీ గరుడ వేగా’ సినిమాతో మళ్లీ హీరో గా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. అయితే ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం 1985 బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కృష్ణాజిల్లాలో ముగ్గురు ధనవంతులైన వారిని మరియు వారి కుటుంబాలను చంపడం కోసం తాగే నీటిలో విషయాన్ని కలుపుతారు కొందరు దుండగులు.

కానీ అదే సమయంలో గుంటూరు జిల్లాలో వరుసగా అనుమానాస్పదంగా కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ రెండిటికి మధ్య ఒక లింక్ ఉంది. అదేంటో విచారించడానికి వచ్చిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రాజశేఖర్.

‘అ!’ సినిమాలో లాగానే ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఎవరూ ఊహించలేని విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా లో అదా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమా కచ్చితంగా రాజశేఖర్ కెరీర్ లో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.