మళ్లీ జతకట్టనున్న ‘మజిలీ’ జంట

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత నాగచైతన్య ఇప్పటికే ‘ఏ మాయ చేసావే’, ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ వంటి సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

ఆన్ స్క్రీన్ మాత్రమే కాక ఆఫ్ స్క్రీన్ లో కూడా తమ కెమిస్ట్రీ తో అదరగొట్టే ఈ ప్రేమ జంట ఈ మధ్యనే ‘మజిలీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న నాగచైతన్య కెరీర్లో ఈ సినిమా ఓ మర్చిపోలేని సూపర్ హిట్ గా మారింది. ప్రస్తుతం ఈచిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ జంట మళ్లీ కలిసి వెండి తెరపై కనిపించబోతోంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత మళ్లీ తన భర్త నాగచైతన్యతో కలిసి ఒక సినిమాలో నటించాలని ప్లాన్ చేస్తోందట.

ఈ నేపథ్యంలో తనకు తెలిసిన దర్శకులందరితోనూ మంచి కథ ఉంటే చెప్పమని ఆఫర్ కూడా ఇచ్చిందట. మరి వీరి కోసం ఎవరైనా మంచి కథలతో వస్తారో లేదో చూడాలి. ఇక త్వరలో ‘ఓ బేబీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సామ్. మరో వైపు నాగచైతన్య వెంకటేష్ తో కలిసి ‘వెంకీ మామా’ అనే మల్టీస్టారర్ లో నటిస్తున్నారు.