చంద్రబాబుది చిల్లర బుద్ధి

చంద్రబాబులో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు తలసాని. చంద్రబాబు మాటల్లో ఒకదానికి మరొకదానికి పొంతన ఉండటం లేదన్నారు ఆయన. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లడగాలని…. కానీ చంద్రబాబు అలా చేయలేదన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు మరచిపోయారేమో కానీ ఇతరులు ఎవరూ మరిచిపోలేదన్నారు తలసాని.

నిద్రలో కూడా కేసీఆర్‌ను చంద్రబాబు కలవరిస్తున్నారన్నారు.

చంద్రబాబుది చిల్లర బుద్ధి. చంద్రబాబు చేసేవన్నీ నీతిమాలిన పనులే…. చంద్రబాబుకు పచ్చమీడియా వంతపాడుతోందన్నారు.
ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు మాటలు హాస్యాస్పదం…. చంద్రబాబు మాటల వల్ల టీడీపీకి వచ్చే ఓట్లు కూడా తగ్గిపోయాయన్నారు.

చంద్రబాబు మాట్లాడుతున్నవన్నీ అబద్దాలేనని…. చిల్లర వ్యక్తులకన్నా చంద్రబాబు తీరు అధ్వాన్నంగా ఉందన్నారు తలసాని.