చంద్రబాబు డైపర్లు వేసుకుని తిరిగితే మంచిది….

జగన్‌ పేరెత్తితేనే ఇటీవల బ్యాలెన్స్‌ కోల్పోతున్నారు చంద్రబాబు. అంతరంగిక సమావేశాలలో సరే…. బయట వేదికల మీద కూడా సభ్యత మరిచి, సంస్కారం మరిచి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.

నిన్న అయితే పత్రికా ప్రతినిధుల ముందు…. కేసీఆర్ ను చూస్తే జగన్‌కు భయం. మోడీని చేస్తే ఉచ్చ పోసుకుంటారు….. తెలియకుండానే ప్యాంట్‌ తడిచిపోతుంది…. అంటూ చాలా చిల్లరగా మాట్లాడాడు చంద్రబాబు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి…. చంద్రబాబు ఇలా మాట్లాడడం అంటే రాబోయే ఎన్నికల తీర్పుకు ఎంతగా భయపడుతున్నాడో అర్థం అవుతోందని, ఇక నుంచి ఆయన డైపర్లు వేసుకుని తిరిగితే మంచిదని… లేకుంటే… లీకై అందరి ముందూ పరువు పోతుందని ట్విట్టర్‌ లో సలహా ఇచ్చారు.

మహా నియంతలు కూడా ఎన్నికల్లో ఇంత నీచానికీ, ఇన్ని అరాచకాలకు పాల్పడి ఉండరని… ఓటర్లను వేల రూపాయలతో ప్రలోభ పెట్టారని, పక్క రాష్ట్రాలనుంచి వందలాది లారీల మద్యాన్ని తెచ్చి రాష్ట్రమంతా ఏరులై పారించాడని… అయినా ఓటింగ్‌ సరళి చూసి ఓడిపోతున్నామని అర్థం కాగానే…. జనం పోలింగ్‌ స్టేషన్లకు రాకుండా చేయడానికి ఆయన, ఆయన ఎల్లో మీడియా ఈవీఎంలు పనిచేయడం లేదని దుష్ప్రచారం చేశాయన్నారు.

50 వేల ఈవీఎంలలో 300 ఈవీఎంలు మొరాయిస్తే వాటిని వెంటనే రిపేర్‌ చేశారని ఒక ఇరవై ఈవీఎంలు మాత్రం పనిచేయలేదన్నారు. వాటిని ఆ తరువాత మార్చారని, అయితే ఈలోగానే 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదంటూ చంద్రబాబు, ఆయన భజన మీడియా యాగీ చేశారని, ఇప్పటికీ అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల రోజున వైసీపీ సానుభూతి పరులపై టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని, వైసీపీ సానుభూతి పరుల ఇళ్ళకు వెళ్ళే మంచి నీళ్ళ పైపులను కూడా ద్వంసం చేశారని, ఇలాంటి నీచమైన పనులకు పాల్పడే రాజకీయ నాయకుడు చరిత్రలో మరొకడు ఉండడని విజయసాయి రెడ్డి విమర్శించారు.

ఎన్నికల తరువాత జైలుకు వెళ్ళక తప్పదన్న భయంతోనే చంద్రబాబు మతి తప్పి ఇలా ప్రవర్తిస్తున్నాడని సాయి రెడ్డి మండిపడ్డారు.