Telugu Global
NEWS

ప్రపంచ సైక్లింగ్ లో భారత వండర్ బోయ్

అండమాన్స్ నుంచి ప్రపంచ సైక్లింగ్ కు… 17 ఏళ్ల వయసులోనే ప్రపంచ సైక్లింగ్ పతకం సైక్లింగ్….సరుకు, కరుకు ఉన్న వాళ్ల క్రీడ. నిర్ణిత సమయంలో మెరుపు వేగంతో సైకిల్ తొక్కాలంటే పిక్కబలంతో పాటు… గుండెనిండా ధైర్యం దండిగా ఉండితీరాలి. సత్తాకు సవాల్ సైక్లింగ్…. యూరోప్ దేశాలు ఆధిపత్యం ప్రదర్శించే ఈ క్రీడలో భారత్ కు అంతంత మాత్రం రికార్డే ఉంది. భారత సైక్లిస్ట్ లు ఆసియా స్థాయి పోటీల్లో రాణించడమే కనాకష్టంగా తయారయ్యింది. అయితే…భారత మెయిన్ ల్యాండ్ […]

ప్రపంచ సైక్లింగ్ లో భారత వండర్ బోయ్
X
  • అండమాన్స్ నుంచి ప్రపంచ సైక్లింగ్ కు…
  • 17 ఏళ్ల వయసులోనే ప్రపంచ సైక్లింగ్ పతకం

సైక్లింగ్….సరుకు, కరుకు ఉన్న వాళ్ల క్రీడ. నిర్ణిత సమయంలో మెరుపు వేగంతో సైకిల్ తొక్కాలంటే పిక్కబలంతో పాటు… గుండెనిండా ధైర్యం దండిగా ఉండితీరాలి.

సత్తాకు సవాల్ సైక్లింగ్….

యూరోప్ దేశాలు ఆధిపత్యం ప్రదర్శించే ఈ క్రీడలో భారత్ కు అంతంత మాత్రం రికార్డే ఉంది. భారత సైక్లిస్ట్ లు ఆసియా స్థాయి పోటీల్లో రాణించడమే కనాకష్టంగా తయారయ్యింది.

అయితే…భారత మెయిన్ ల్యాండ్ కు దూరంగా విసిరేసినట్లు ఉండే అండమాన్ నికోబార్ ద్వీపాలకు చెందిన ఇసో అల్బెన్ ప్రపంచ జూనియర్ సైక్లింగ్ లో పతకాలు సాధించడం ద్వారా సరికొత్త చరిత్రకు తెరతీశాడు.

ఒకే ఒక్కడు అల్బెన్…

స్విట్జర్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచ జూనియర్ సైక్లింగ్ ట్రాక్ విభాగంలో అల్బెన్ రజత పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు..ఆసియా జూనియర్ సైక్లింగ్ ట్రాక్ పోటీలలో అల్బెన్ ఏకంగా ఆరు బంగారు పతకాలు సాధించడం ద్వారా ప్రపంచ అంతర్జాతీయ గుర్తింపు సంపాదించాడు.

అంతేకాదు…ప్రపంచ, ఆసియా ట్రాక్ పోటీలలో నిలకడగా రాణించడం ద్వారా…ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం సంపాదించాడు. ఈ ఘనత సాధించిన భారత తొలి, ఏకైక సైక్లిస్ట్ గా రికార్డు నెలకొల్పాడు.

బాల్యం నుంచి తనకు సైకిల్ అంటే ఎంతో ఇష్టమని పొంగిపోతూ చెప్పే 17 అల్బెన్ మాత్రం…4వేల రూపాయల ఖరీదు చేసే సైకిల్ తో ప్రారంభించి…ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఖరీదు చేసే R-96 బ్రాండ్ సైకిల్ తొక్కే స్థాయికి ఎదిగాడు.

సైకిల్ పెడల్ పై కాలు మోపిన వెంటనే మెరుపువేగంతో దూసుకుపోవడం అంటే తనకు ఎంతో మక్కువ అని చెప్పే అబెన్ కు స్ర్పింట్స్ విభాగంలో స్పెషలిస్ట్ గా పేరుంది.

తల్లి ప్రోత్సాహంతో….

అండమాన్ అండ్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ లో అబెన్ తండ్రి అగ్నిమాపక శాఖలో అధికారిగా ఉంటే….తల్లి మాత్రం అటవీశాఖలో ఉద్యోగినిగా ఉంది. తనకు తొలి సైకిల్ ను తల్లి బహుమతిగా ఇచ్చిందనీ, సైక్లింగ్ సైతం ఓ అంతర్జాతీయ క్రీడేనని చెప్పి ప్రోత్సహించడం తనకు ఇప్పటికీ గుర్తేనంటూ మురిసిపోతున్నాడు.

2024 ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా జాతీయ శిక్షకుడు శర్మ నేతృత్వంలో అబెన్ తన ప్రాక్టీసు కొనసాగిస్తున్నాడు.

తనకు స్మార్ట్ ఫోన్ అంటే ఏమాత్రం ఇష్టం ఉండదని…స్మార్ట్ ఫోన్ దగ్గరుంటే ఏకాగ్రత ఉండనే ఉండదని, ఏదీ సాధించలేమని తనకు అనుభవమయ్యిందని తెలిపాడు. ఏదిఏమైనా…భారత సైక్లింగ్ చరిత్రలో అబెన్ కు ప్రత్యేకస్థానం ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  13 April 2019 9:17 PM GMT
Next Story