నాని కోసం వేదికపైకొస్తున్న వెంకీ

మీకు తెలుసా.. హీరో నానికి నిజజీవితంలో స్ఫూర్తి రగిలించే హీరో వెంకీ. అవును.. వెంకటేశ్ అంటే నానికి చాలా ఇష్టం. వెంకటేష్ లా ఎమోషన్ పండించడం తన వల్ల కాదంటాడు నాని. చిన్నప్పట్నుంచి వెంకీ సినిమాలు చూస్తూ పెరిగానని, నటుడిగా మారాలనే తన కోరికకు కూడా వెంకీనే స్పూర్తి అంటాడు. అలాంటి నాని సినిమా కార్యక్రమానికి వెంకటేష్ ప్రత్యేక అతిథిగా వస్తున్నాడు. దీంతో నాని ఆనందానికి అవథుల్లేవ్.

రేపు సాయంత్రం శిల్పకళావేదికలో జెర్సీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు వెంకటేష్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లకు వెంకీ చాలా దూరం. కానీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలతో ఉన్న చనువుకొద్దీ ఈ ఫంక్షన్ కు రావడానికి ఒప్పుకున్నాడు. పైగా ఆ బ్యానర్ లో వెంకీ త్వరలోనే ఓ సినిమా కూడా చేయాల్సి ఉంది.

మొత్తానికి ఏదైతేనేం ఎట్టకేలకు నాని-వెంకీ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నాడు. వెంకటేష్ కు ఇలాంటి వేదికలు కొత్తకాదు కానీ, తన అభిమాన హీరో వెంకీతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం నానికి మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఆ క్షణం కోసం నాని వెయిటింగ్. ఈ నెల 19న థియేటర్లలోకి రాబోతోంది జెర్సీ సినిమా. ఈ మూవీ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.