కాంచన త్రీ గురించి పట్టించుకోని రాఘవ లారెన్స్

హారర్ కామెడీతో బోలెడు చిత్రాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అందులో హిట్ అయిన సినిమాలు అంటే ముని సిరీస్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు అందులో నాల్గవ భాగం మరియు ‘కాంచన’ సిరీస్ లో మూడవ భాగం గా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో హీరోగా నటించిన రాఘవ లారెన్స్ దర్శకత్వం కూడా వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికి దర్శక నిర్మాతలు ఈ సినిమా ప్రమోషన్ లపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. 

అటు తమిళంలో కానీ ఇటు తెలుగులో కానీ కనీసం ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కూడా కనిపించటంలేదు ‘కాంచనా 3’ బృందం. అసలు ఈ సినిమాపై దర్శకుడు మరియు నటుడు అయిన లారెన్స్ కి నమ్మకం లేదని, ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలీదు కానీ లారెన్స్ వైఖరి మాత్రం ఎవరికీ అర్థం కాకుండా ఉంది. నిజానికి ‘కాంచన 2 (గంగ)’ సినిమా కోసం విపరీతంగా ప్రమోషన్లు చేశారు దర్శక నిర్మాతలు. కానీ ‘కాంచన 3’ సినిమాకి వచ్చేసరికి మాత్రం ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారు అని అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.