ఫుడ్ పాయిజన్ పై ఫైట్ చేయనున్న నితిన్

యువ హీరో నితిన్ వరుస పరాజయాలతో చతికిల పడ్డాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి.

అయితే వెంటనే ఇంకో సినిమా చేయకుండా కాస్త తెలివి గా ఆలోచిస్తూ నితిన్ బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు వరుసగా రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుములు దర్శకత్వం లో ఒక చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ని ఇప్పటికే అనౌన్స్ చేయడమే కాకుండా సినిమా కి సంబందించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే చిత్రం లో ఫుడ్ పాయిజన్ అనే అంశం పై నితిన్ పోరాటం చేస్తాడు అని తెలిసింది. ఫుడ్ పాయిజన్ ఒక సీరియస్ అంశం. దానిని అంతే సెన్సిబుల్  చెప్పే ప్రయత్నం చేస్తున్నాడట దర్శకుడు. చలో సినిమా తో మంచి విజయం అందుకున్న దర్శకుడు తన రెండో చిత్రాన్ని కూడా విజయ బాట లో నడిపే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో సినిమా కి సంబందించిన షూటింగ్ మొదలు కానుంది.