మారుతిని ఫాలో అయి పేరు మార్చుకున్నాడా?

వరుసగా ఆరు డిజాస్టర్ లను అందుకున్న ఒకే ఒక్క మెగా హీరో సాయి ధరంతేజ్. ‘సుప్రీం’ సినిమాతో హిట్ అందుకున్న ఈ మెగా మేనల్లుడు తన తదుపరి సినిమాలతో విన్నింగ్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ‘సుప్రీం’ సినిమా తర్వాత తేజ్ ను కేవలం పరాజయాలే పలకరించాయి.

గతం లో విడుదలైన ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో.. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి తన ధ్యాస మొత్తం ‘చిత్రలహరి’ సినిమాపైనే పెట్టాడు మెగా హీరో.

అయితే ఇండస్ట్రీలో కొందరి లాగా సాయి ధరమ్ తేజ్ కూడా న్యూమరాలజీ ప్రకారం తన పేరును మార్చుకున్నాడు. ‘చిత్రలహరి’ చిత్రంలోని టైటిల్స్ లో తేజూ పేరు సాయి తేజ్ అని ప్రకటించారు.
నిజానికి దర్శకుడు మారుతి కూడా న్యూమరాలజీ ని బాగా ఫాలో అవుతాడు. సాయి ధరం తేజ్ తదుపరి సినిమా మారుతి తో ఉంది కాబట్టి ఆ న్యూమరాలజీ సెంటిమెంట్ ఇప్పుడు మెగా మేనల్లుడు కి కూడా సోకిందని కొందరు అంటున్నారు.

ఏదేమైనా ఈ కొత్త పేరు. ఈ మెగా హీరోకి మంచి గా నే కలిసి వచ్చింది అని చెప్పచ్చు. ఆరు పరాజయాల తర్వాత వచ్చిన చిత్రలహరి సినిమా బాగానే వసూళ్ళను రాబడుతోంది. పేరు మార్పు తరువాత వచ్చిన ఈ సినిమా.. పరంపర కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.