సమంత ఆశలపై నీళ్లుచల్లిన నాగచైతన్య

ఇద్దరూ కలిసి మజిలీ సినిమా పూర్తిచేశారు. ఆ మూవీ తర్వాత సమంత కావాలనే గ్యాప్ తీసుకుంది. ఓ 3 వారాలు రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. పనిలోపనిగా నాగచైతన్య కూడా ఓ వారం గ్యాప్ తీసుకుంటే, కలిసి చిన్న ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేద్దామని సమంత ఆలోచన. కానీ తన భార్యకు అంత అవకాశం ఇవ్వలేదు నాగచైతన్య. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయాడు.

మజిలీ సినిమా పూర్తయిన వెంటనే వెంకీమామ సెట్స్ పైకి వెళ్లిపోయాడు నాగచైతన్య. పోనీ ఆ సినిమా తర్వాతైనా కాస్త గ్యాప్ తీసుకుంటాడనుకుంటే ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వెంకీ మామ కంప్లీట్ అయిన వెంటనే దిల్ రాజు బ్యానర్ లో శశి దర్శకత్వంలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే, వెంకీ మామ సెట్స్ పై ఉంటుండగానే దిల్ రాజు సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

ఇలా కెరీర్ లో గ్యాప్ అన్నదే లేకుండా దూసుకుపోతున్నాడు నాగచైతన్య. పెళ్లి తర్వాత ఇప్పటివరకు చైతూ గ్యాప్ తీసుకోలేదు. వీకెండ్స్ లో భార్యాభర్తలిద్దరూ కలుసుకోవడం మినహా, ఇప్పటివరకు హనీమూన్ కూడా ప్లాన్ చేసుకోలేదు. నాగచైతన్యకు తనకు ఇలా సినిమాలతో బిజీగా ఉండడమే ఇష్టమంటోంది సమంత.