వామ్మో…. ఇంకో సినిమా ఆగిపోయింది

మొన్నటికి మొన్న సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నాగశౌర్య చేయాల్సిన సినిమా ఆగిపోయింది. అంతకంటే ముందు భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమాను సగం చేసి మరీ పక్కనపెట్టేశాడు నాగశౌర్య. ఇప్పుడు మరో సినిమా కూడా ఆగిపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈసారి కూడా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పైనే.

సుకుమార్ నిర్మాతగా, సూర్యప్రతాప్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా రావాలి. అన్-అఫీషియల్ గా ఆ సినిమాను ప్రకటించారు కూడా. కానీ ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది. నితిన్ కు సూర్యప్రతాప్ లైన్ వినిపించాడు. ఓ 30 నిమిషాలు నెరేషన్ కూడా ఇచ్చాడు. కానీ తనకు బౌండ్ స్క్రిప్ట్ కావాలని పట్టుబట్టాడు నితిన్. ఇది సుకుమార్ కు నచ్చలేదు.

మూవీ ఓపెనింగ్ అయిన తర్వాత అంతా కలిసి కూర్చొని ఫైనల్ చేద్దామని సుకుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట. కానీ కొబ్బరికాయ కొట్టడానికంటే ముందే తనకు కంప్లీట్ స్క్రిప్ట్ కావాలని పట్టుబట్టాడట నితిన్. దీంతో మనస్పర్థలు వచ్చి ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది.