అల్లు అర్జున్ సినిమా లో కనిపించనున్న సుశాంత్

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అక్కినేని హీరోలలో ఒకరు సుశాంత్. సుశాంత్ కెరీర్ లో పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ లేమీ లేవు. కానీ తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నటించిన ‘చిలసౌ’ సినిమా తో ఒక మోస్తరు హిట్ ను అందుకున్నాడు.

అప్పటిదాకా కమర్షియల్ సినిమాలతో డిజాస్టర్లను చవిచూసిన సుశాంత్…. ఒక ప్రేమ కథ తో ఓకే అనిపించుకున్నాడు. అయితే తాజాగా సుశాంత్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు మాటల మాంత్రికుడు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుశాంత్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మరియు వాటి పై రియాక్ట్ అవ్వడానికి బోల్డంత టైం తీసుకునే వాడిలా సుశాంత్ ఈ సినిమాలో నటించనున్నాడు అని తెలుస్తోంది.

అంతేకాక ఈ సినిమాలో నవదీప్ కూడా అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. టబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గీత ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.