Telugu Global
Health & Life Style

బీట్ రూట్.. రోగాలు బలాదూర్...

బీట్ రూట్… కంటికి అందంగా కనిపించమే కాదు… ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. శాఖాహార దుంపలలో బీట్ రూట్ కు ఒక విశిష్టమైన స్దానం ఉంది. కూరగాయలలో బీట్ రూట్… ఆరోగ్య ప్రదాయిని. అంతటి విశిష్టత ఉన్న ఈ బీట్ రూట్ గురించి తెలుసుకుందాం… బీట్ రూట్ ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. బీట్ రూట్ ను సన్నగా తురుముకుని బెల్లంతో కలిపి తింటే ఎనీమియా అదుపులోకి వస్తుంది.  ఇందులో ఉన్న కాపర్ చర్మవ్యాధులను […]

బీట్ రూట్.. రోగాలు బలాదూర్...
X

బీట్ రూట్… కంటికి అందంగా కనిపించమే కాదు… ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. శాఖాహార దుంపలలో బీట్ రూట్ కు ఒక విశిష్టమైన స్దానం ఉంది. కూరగాయలలో బీట్ రూట్… ఆరోగ్య ప్రదాయిని. అంతటి విశిష్టత ఉన్న ఈ బీట్ రూట్ గురించి తెలుసుకుందాం…

  • బీట్ రూట్ ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.
  • బీట్ రూట్ ను సన్నగా తురుముకుని బెల్లంతో కలిపి తింటే ఎనీమియా అదుపులోకి వస్తుంది.
  • ఇందులో ఉన్న కాపర్ చర్మవ్యాధులను దరి చేరనివ్వదు.
  • ఇందులో ఉన్న ఫోలిక్ యాసిడ్ మహిళలలో సంతాన సాఫల్యతను పెంచడానికి తోడ్పడుతుంది.
  • బీట్ రూట్ జ్యూస్ ఒక ఎనర్టీ బూస్టర్ గా పనిచేస్తుంది.
  • అధిక రక్తపోటుతో బాధ పడుతున్న వారు ఒక గ్లాసు బీట్ రూట్ తాగితే అరగంటలో బీపీ అదుపులోకి వస్తుంది.
  • బీట్ రూట్ లో కార్బొహైడ్రేట్స్, క్యాలిషియం, ఐరన్, విటమిన్ సి, ప్రొటీన్స్, జింక్, ఫాస్ఫరస్ లు అధికంగా ఉంటాయి.
  • బీట్ రూట్ లో కొవ్వు పదార్దాలు అస్సలు లేవు. దీంతో బీట్ రూట్ రోజూ తీసుకున్నా ఎలాంటి హానీ కలుగజేయదు.
  • బీట్ రూట్ కారణంగా కాలేయం పనితీరు మెరుగు పడుతుంది. అంతే కాదు… రక్తనాళాలనూ శుభ్ర పరుస్తుంది.
  • మతిమరుపుతో బాధపడుతున్న వారికి రోజూ ఓ గ్లాసు బీట్ రూట్ జ్యూస్ ఇస్తే వారి జ్ఞాపక శక్తి క్రమేపి పెరుగుతుంది.
  • బీట్ రూట్ లో ఉన్న నైట్రేట్ నిల్వలు రక్త ప్రసారాన్ని వేగవంతం చేసి శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.
  • రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.
  • బీట్ రూట్ లో విటమిన్ ఎ, మినరల్స్, మెగ్నీషియం, పోటాషియం అధికంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్, మలబద్దకం, మూలశంఖ వ్యాధుల నుంచి కాపాడుతాయి.
  • మెదడు చురుగ్గా పనిచేయాలంటే క్రమం తప్పకుండా బీట్ రూట్ తీసుకుంటే మంచిది. బద్దకం, నీరసం, నిస్తేజం వంటివి దరికి చేరనివ్వదు. తక్షణ శక్తిని ఇచ్చి శరీరానికి మంచి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలుగ చేయడానికి బీట్ రూట్ దోహదపడుతుంది.
  • బీట్ రూట్ జ్యూస్ చర్మానికి మంచి రంగు ఇవ్వడమే కాదు…. కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలను పోగొడుతుంది.
  • దీంట్లో ఉన్న విటమిన్ బీ వెంట్రుకులకు బలాన్ని ఇస్తుంది.
  • బీట్ రూట్ లోని అధిక పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని (immunity, resistance) పెంచుతాయి.
  • గుండెకు ఆరోగ్యవంతమైన రక్తాన్ని పంప్ చేయడంలో బీల్ రూట్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.
  • కడుపులో ఉన్న మలినాలను, ఇతర వ్యర్దాలను బయటకి పంపి సుఖ విరోచనం అయ్యేందుకు బీట్ రూట్ దోహదపడుతుంది.
  • అయితే కొందరికి బీట్ రూట్ సరిపడదు. అలాంటి వారు బీట్ రూట్ కు దూరంగా ఉండడం మేలు.
First Published:  14 April 2019 9:08 PM GMT
Next Story