Telugu Global
NEWS

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్.... ఏమైపోయినట్టు?

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి.. ప్రచార హోరు పూర్తయ్యింది. ఇక అంతా సైలెన్స్ .. ఇక ఫెడరల్ ఫ్రంట్ అంటూ… దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తానన్న కేసీఆర్ మాత్రం సైలెంట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఎన్నికల ముందు కేసీఆర్ ఊదరగొట్టారు. ప్రతిపక్ష పార్టీలను కలిశాడు. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక మాత్రం సైలెంట్ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా కలిసి వచ్చే నేతలను సమాయత్తం చేయడం కానీ.. వారి తరుఫున […]

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్.... ఏమైపోయినట్టు?
X

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి.. ప్రచార హోరు పూర్తయ్యింది. ఇక అంతా సైలెన్స్ .. ఇక ఫెడరల్ ఫ్రంట్ అంటూ… దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తానన్న కేసీఆర్ మాత్రం సైలెంట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

కాగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఎన్నికల ముందు కేసీఆర్ ఊదరగొట్టారు. ప్రతిపక్ష పార్టీలను కలిశాడు. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక మాత్రం సైలెంట్ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా కలిసి వచ్చే నేతలను సమాయత్తం చేయడం కానీ.. వారి తరుఫున వివిధ రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేయడం కానీ కేసీఆర్ చెయ్యడం లేదు.

నిజానికి కేసీఆర్ బహుభాషా కోవిదుడు.. హిందీలో బాగా మాట్లాడుతారు. అలాంటి ఘనాపాఠి కేసీఆర్ ప్రచారం చేస్తే ఆయా రాష్ట్రాల్లో పార్టీలకు మేలు జరుగుతుంది. కానీ ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆదిలో ఉవ్వెత్తున ఎగిసిన కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

First Published:  14 April 2019 8:01 PM GMT
Next Story