తొందర పెడుతున్న సమంత

తన భర్త తో కలిసి నటించిన సినిమా మజిలీ హిట్ అయిన నేపథ్యం లో సమంత ఆనందానికి హద్దులేకుండా పోయింది. పెళ్ళి చేసుకున్న తర్వాత మొదటి సారి ఇరువురు కలిసి నటించడం, దానికి మంచి పేరు రావడం తో ఇద్దరూ తెగ ఆనంద పడిపోతున్నారు.

ఒక పక్క సమంత కి పెద్ద పేరు రాగా, నాగ చైతన్య కి కూడా ఊహించని రీతి లో ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా విజయం తో చైతన్య తన తదుపరి చిత్రాలని ఆచి తూచి ఎంచుకోవాలని నిర్ణయానికి రాగా సమంత మాత్రం ఈ సినిమా విజయాన్ని పూర్తిగా వాడుకోవాలనుకుంటోంది.

సమంత నటించిన “ఓ బేబీ ఎంత సక్కగున్నావే” చిత్రం షూట్ కంప్లీట్ చేసుకుని విడుదల కి సిద్ధం గా ఉన్నది. నందిని రెడ్డి దర్శకత్వం లో సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణం లో వస్తున్న ఈ చిత్రాన్ని సమంత విడుదల చేయాలని దర్శక నిర్మాతలని తొందర పెడుతున్నదట. మజిలీ విజయం అందరూ మరువక ముందే ఈ సినిమా ని విడుదల చేసి క్రేజ్ ని కాష్ చేసుకోవాలనేది సమంత కోరిక.

ఈ సినిమా సమంత కెరీర్ లో ఒక ప్రయోగాత్మక చిత్రం. అందుకే విజయానందం లో ఉన్నప్పుడే ఇలాంటి చిత్రం ప్రేక్షకుల కి చూపిస్తే కాస్త కలిసి వస్తుంది అని అంటోందట. దర్శక నిర్మాతలు సినిమా ని త్వరలో విడుదల చేసందుకు ప్రయత్నిస్తున్నారు. విడుదల తేదీ ని కూడా త్వరలో ఖరారు చేసి అధికారికం గా ప్రకటించనున్నారు.