Telugu Global
Cinema & Entertainment

'జాన్'లో కూడా యాక్షన్ ఉంటుంది

సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు హీరో ప్రభాస్. ఈ మూవీకి జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. పారిస్ బ్యాక్ డ్రాప్ లో 1920ల నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇన్నాళ్లూ ఒక రొమాంటిక్ డ్రామాగా భావించారంతా. కానీ ఇది కూడా యాక్షన్ సినిమానే ఉంటున్నాడు ప్రభాస్ జాన్ సినిమాలో రొమాన్స్, లవ్ ఉన్నప్పటికీ సినిమాలో 50శాతం […]

జాన్లో కూడా యాక్షన్ ఉంటుంది
X

సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు హీరో ప్రభాస్. ఈ మూవీకి జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. పారిస్ బ్యాక్ డ్రాప్ లో 1920ల నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇన్నాళ్లూ ఒక రొమాంటిక్ డ్రామాగా భావించారంతా. కానీ ఇది కూడా యాక్షన్ సినిమానే ఉంటున్నాడు ప్రభాస్

జాన్ సినిమాలో రొమాన్స్, లవ్ ఉన్నప్పటికీ సినిమాలో 50శాతం యాక్షన్ కూడా ఉంటుందని తెలిపాడు ప్రభాస్. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభాస్, ప్రస్తుతం ప్రేక్షకులంతా తన నుంచి యాక్షన్ సినిమాలే ఆశిస్తున్నారని తెలిపాడు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు, బాహుబలి-2 తర్వాత సాహో లాంటి యాక్షన్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నానని తెలిపిన ప్రభాస్, సాహో తర్వాత రాబోతున్న జాన్ సినిమాలో కూడా 50శాతం యాక్షన్ పాళ్లు ఉంటాయని స్పష్టంచేశాడు.

జాన్ సినిమా కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనే వస్తోంది. కాకపోతే కృష్ణంరాజుకు చెందిన గోపీకృష్ణ మూవీస్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జాన్ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అంతకంటే ముందు ఈ ఏడాది ఆగస్ట్ 15న సాహో సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  16 April 2019 5:00 AM GMT
Next Story