Telugu Global
Cinema & Entertainment

ABCD... నవ్వుల ట్రైలర్...

చాలా కాలం గాప్ తర్వాత అల్లు శిరీష్ నటించిన చిత్రం ఏబీసీడీ. ఏబీసీడీ అంటే అమెరికన్ బార్న్ కంఫ్యూస్డ్ దేశీ. మలయాళం లో అదే పేరు తో తెరకెక్కిన సినిమా కి ఇది తెలుగు రీమేక్. ఒరిజినల్ వర్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరో గా చేయగా, ఆ పాత్ర ని తెలుగులో శిరీష్ పోషిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ తెలుగు చిత్రానికి మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మాతలు. అయితే ఈ […]

ABCD... నవ్వుల ట్రైలర్...
X

చాలా కాలం గాప్ తర్వాత అల్లు శిరీష్ నటించిన చిత్రం ఏబీసీడీ. ఏబీసీడీ అంటే అమెరికన్ బార్న్ కంఫ్యూస్డ్ దేశీ. మలయాళం లో అదే పేరు తో తెరకెక్కిన సినిమా కి ఇది తెలుగు రీమేక్.

ఒరిజినల్ వర్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరో గా చేయగా, ఆ పాత్ర ని తెలుగులో శిరీష్ పోషిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ తెలుగు చిత్రానికి మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మాతలు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా, విడుదల మాత్రం రెండు సార్లు వాయిదా పడింది. మే 17 న విడుదల అని ప్రకటించిన నిర్మాతలు ఈ సినిమా కి సంబంధించిన ప్రచార బాధ్యతలను మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని ఆన్లైన్ లో విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ట్రైలర్ మొత్తం వినోద భరితం గా సాగింది. ఎరక్క పోయి ఇండియా వచ్చి…. తిరిగి మళ్ళీ అమెరికా వెళ్లలేక ఇరుక్కుపోయిన అల్లు శిరీష్ తన స్నేహితుడి తో కలిసి ఇక్కడ ఏం చేసాడు అనేది కథ.

కృష్ణార్జున యుద్ధంతో అందరినీ మెప్పించిన రుక్సార్ ఈ సినిమా లో నాయిక. పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లో ఒక మంచి వినోదాత్మక చిత్రం గా ఈ సినిమా రూపు దిద్దుకుంటుంది. ట్రైలర్ లాగా నే సినిమా కూడా ఆద్యంతం వినోదం గా ఉంటె, సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.

First Published:  15 April 2019 10:57 PM GMT
Next Story