అఖిల్ నాలుగో సినిమాపై అనుమానాలు

లెక్కప్రకారం ఈపాటికి అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమవ్వాలి. కానీ ఇప్పుడా సినిమాపై అనుమానాలు ఎక్కువయ్యాయి. రీసెంట్ గా ఈ స్టోరీ విన్న నాగార్జున పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది.

ముందుగా అఖిల్ వద్దకు బొమ్మరిల్లు భాస్కర్ ను పంపించాడు నిర్మాత అల్లు అరవింద్. భాస్కర్ చెప్పిన కథ అఖిల్ కు నచ్చింది. తర్వాత అఖిల్-అరవింద్ మాట్లాడుకున్నారు. అంతా ఓకే అనుకున్నారు. ఆ టైమ్ లో బిజీగా ఉండి నాగార్జున కథ వినలేదు. మన్మధుడు-2 సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న నాగార్జున, తాజాగా ఆ స్టోరీలైన్ విన్నాడట. సినిమాలో అఖిల్ కంటే హీరోయిన్ పాత్రకే ఎక్కువ స్కోప్ ఉందనే విషయాన్ని నాగ్ గ్రహించాడు. అసలే అఖిల్ కు హిట్స్ లేవు. ఇలాంటి టైమ్ లో హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువగా ఉండే సినిమాలో అఖిల్ నటిస్తే రెండు నష్టాలు.

వీటిలో ఒకటి ఏంటంటే.. సినిమా ఫ్లాప్ అయినా అఖిల్ కు నష్టమే. ఎవరూ హీరోయిన్ పేరెత్తరు. అఖిల్ కే ఫ్లాప్ వచ్చిందంటారు. పోనీ సినిమా హిట్ అయిందనుకుందాం. ఇలా చూసుకున్నా కష్టమే. హీరోయిన్ కే పేరొస్తుందని కానీ అఖిల్ కు రాదనే అనుమానం. అందుకే ఈ ప్రాజెక్టుపై నాగ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తోంది.