‘అ’ సెంటిమెంట్ ని వదలని త్రివిక్రమ్ 

తెలుగు సినిమా ప్రేక్షకులని దాదాపు గా ఆరు మాసాలు నిరీక్షించేలా చేసి, చివరికి అల్లు అర్జున్ తో సినిమా ని అనౌన్స్ చేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు బన్నీ తో మూడో సారి జత కడుతుండడం విశేషం.

ఇంతకు ముందు వీరి కలయిక లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి పెద్ద విజయాలు సాధించాయి. అందుకే ఈ సినిమా పై అనేక అంచనాలు ఇప్పటికే ఏర్పడ్డాయి.

ఇంతకు ముందు నాన్న-నేను అనే టైటిల్ ఈ సినిమా కి పెడుతున్నట్లు వార్తలు రాగా, అందులో ఏ మాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ కి సంబందించిన వర్గాలు తెలియజేశాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఈ సినిమా కి ‘అ’ అక్షరం తో టైటిల్ పెట్టనున్నాడట. అతడు, అజ్ఞాతవాసి, అఆ, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలు ‘అ’ అనే అక్షరం తో నే మొదలు అయ్యాయి. అయితే తన తదుపరి చిత్రానికి కూడా ‘అ’ కలిసి వచ్చేలా ‘అలకనంద’ అనే టైటిల్ ని త్రివిక్రమ్ పరిశీలిస్తున్నాడట.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమా టైటిల్ పై ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ సినిమా షూట్ మొదలయ్యే టైం కి ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.