శంకర్ తో మెగాస్టార్?

ఈ మధ్యనే ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పూర్తయ్యాక మెగాస్టార్ చేయబోయే సినిమాల పై బోలెడు పుకార్లు బయటకు వస్తున్నాయి. ‘సైరా’ సినిమా తర్వాత మెగాస్టార్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత చిరు శంకర్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కొన్ని డిస్కషన్ లు కూడా జరిగిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాగా ఆలస్యం కాకముందే ఇలాంటి కాంబినేషన్ లో నటించాలని చిరంజీవి కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శంకర్…. చిరుకి సరిపోయేలా ఒక కథ రాసుకున్నాడట. అయితే తెలుగులో చిరు హీరోగా ఈ సినిమాను తమిళంలో కూడా తీసి అందులో మాత్రం విజయ్ లేదా అజిత్ ని తీసుకోవాలని అనుకుంటున్నాడట శంకర్.

అన్నీ కుదిరితే, చిరు-శంకర్ సినిమాని అల్లు అరవింద్, రామ్ చరణ్ మరియు స్టూడియో గ్రీన్ సంస్థలు కలిసి నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా ఇంకా చర్చల్లోనే ఉంది కాబట్టి ఈ చిత్రం పట్టాలు ఎక్కుతుందో లేదో మాత్రం ఇప్పుడే చెప్పటం కష్టం.