ఐపీఎల్ -12లో బెంగళూరు ఏడో ఓటమి

  • బెంగళూరుపై 5 వికెట్లతో నెగ్గిన ముంబై
  • పాండ్యా హిట్టు….విరాట్ కొహ్లీ టీమ్ ఫట్టు
  • ఎనిమిది రౌండ్లలో 7 పరాజయాల బెంగళూరు
  • లీగ్ టేబుల్ మూడోస్థానంలో ముంబై, అట్టడుగున బెంగళూరు

ఐపీఎల్ 12వ సీజన్…మొదటి ఎనిమిది రౌండ్లలోనే…మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఏడో ఓటమి చవిచూసింది. ప్లేఆఫ్ రౌండ్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకొంది.

ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన ఈ ఎనిమిదో రౌండ్ పోటీలో…నెగ్గి తీరాల్సిన రాయల్ చాలెంజర్స్ ను …ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తో అధిగమించింది.

172 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబైకి….ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా 16 బాల్స్ లోనే 37 పరుగుల నాటౌట్ స్కోరుతో విజయం ఖాయం చేశాడు. హార్థిక్ 5 బౌండ్రీలు, 2 సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు.

ఆఖరి రెండు ఓవర్లలో 22 పరుగులు కావాల్సిన ముంబైకి…ఆట 19వ ఓవర్లనే పాండ్యా విజయం అందించాడు.

ప్రస్తుత సీజన్ మొదటి ఎనిమిదిరౌండ్లలో ముంబైకి ఇది ఐదో గెలుపు కాగా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మాత్రం ఏడో పరాజయం. ఈ విజయంతో 10 పాయింట్లు సంపాదించిన ముంబై లీగ్ టేబుల్ మూడోస్థానంలో నిలువగలిగింది.

ఎనిమిదిరౌండ్లలో రెండు పాయింట్లు మాత్రమే సాధించిన బెంగళూరు…ఎనిమిదిజట్ల లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయింది.