ఫార్ములావన్ చరిత్రలో 1000వ రేస్

  • షాంఘై రేస్ ట్రాక్ లో ముగిసిన వెయ్యివ రేస్
  • చైనీస్ గ్రాండ్ ప్రీ విజేతగా లూయి హామిల్టన్
  • ఆరోసారి చైనీస్ గ్రాండ్ ప్రీ టైటిల్ నెగ్గిన హామిల్టన్

గంటకు 360 కిలోమీటర్ల వేగంతో సాగిపోయే ఫార్ములావన్ సర్క్కూట్ చరిత్రలో వెయ్యవ రేస్…చైనా గడ్డ షాంఘైలో ముగిసింది.


2019 చైనీస్ గ్రాండ్ ప్రీ రేస్ లో….టీమ్ మెర్సిడెస్ స్టార్ రేసర్ లూయి హామిల్టన్ విజేతగా నిలిచాడు.

మెర్సిడెస్ టీమ్ కే చెందిన వాల్టెర్రీ బొట్టాస్ రెండు, టీమ్ ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెట్టల్ మూడు స్థానాలతో సరిపెట్టుకొన్నారు.
ఐదుసార్లు ప్రపంచ విజేత లూయి హామిల్టన్…చైనీస్ గ్రాండ్ ప్రీ టైటిల్ నెగ్గటం ఇది ఆరవసారి.

అంతేకాదు…కెరియర్ లో ఓవరాల్ గా ఇది 75వ రేస్ విజయం కావడం విశేషం. 1950లో ప్రారంభమైన ఫార్ములావన్ చరిత్రలో…చైనీస్ గ్రాండ్ ప్రీ వెయ్యివ రేస్ గా రికార్డుల్లో చేరింది.

ప్రస్తుత సీజన్ నాలుగో రేస్ అజర్ బైజాన్ లోని బాకు రేస్ ట్రాక్ లో వచ్చేవారం జరుగనుంది.