నాని నిర్మాణంలో హీరోగా రానా !

హీరోగా పీక్ స్టేజ్ లో ఉన్న నాచురల్ స్టార్ నాని ‘అ!’ అనే సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత విజయం అయితే సాధించలేదు.

ఈ సినిమా తర్వాత హీరోగా బిజీ అయిపోయిన నాని… మళ్ళీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు చేపడతాడు అని అభిమానులు కూడా ఎదురుచూశారు. అయితే తాజాగా నాని మరొక సినిమా ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాక ఈ సినిమాలో రానా దగ్గుబాటి ని హీరోగా తీసుకోబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ మధ్యనే ఒక యువ దర్శకుడు నాని ని కలిసి ఒక స్క్రిప్ట్ ను నెరేట్ చేశాడట. కథ చాలా బాగుండటంతో నాని స్వయంగా దానిని నిర్మించేందుకు సిద్దమయ్యాడట.

ఈ సినిమాలో రానా దగ్గుబాటి ని హీరో గా తీసుకుంటే బాగుంటుందని నాని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే రానా మాత్రం ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉందట.

ప్రస్తుతం రానా చేతిలో ‘1945’, ‘హాథి మేరే సాథి’, ‘హిరణ్యకశిప’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించిన ‘జెర్సీ’ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది.