Telugu Global
Cinema & Entertainment

నాని-వెంకీ సినిమా.... నవ్వి ఊరుకున్న వెంకీ

హీరో నానికి మల్టీస్టారర్స్ కొత్తకాదు. ఇప్పటికే నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమా చేశాడు నాని. అది మంచి సక్సెస్ సాధించింది కూడా. ఇప్పుడు వెంకీతో కూడా మల్టీస్టారర్ చేస్తానంటున్నాడు. ఈ విషయాన్ని జెర్సీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో బయటపెట్టాడు ఈ హీరో. జెర్సీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు వెంకటేష్. ఈ సందర్భంగా మాట్లాడిన నాని, వెంకటేష్ కు కృతజ్ఞతలు చెబుతూనే.. కుదిరితే ఆయనతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందంటూ మనసులో […]

నాని-వెంకీ సినిమా.... నవ్వి ఊరుకున్న వెంకీ
X

హీరో నానికి మల్టీస్టారర్స్ కొత్తకాదు. ఇప్పటికే నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమా చేశాడు నాని. అది మంచి సక్సెస్ సాధించింది కూడా. ఇప్పుడు వెంకీతో కూడా మల్టీస్టారర్ చేస్తానంటున్నాడు. ఈ విషయాన్ని జెర్సీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో బయటపెట్టాడు ఈ హీరో.

జెర్సీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు వెంకటేష్. ఈ సందర్భంగా మాట్లాడిన నాని, వెంకటేష్ కు కృతజ్ఞతలు చెబుతూనే.. కుదిరితే ఆయనతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు.

“వెంకటేష్ ఫంక్షన్ కు వెళ్లాలనే కోరిక ఉండేది. అది బాబు బంగారంతో తీరిపోయింది. నా ఫంక్షన్ కు ఆయనొస్తే బాగుండేదనే కోరిక ఉండేది. అది జెర్సీతో తీరిపోయింది. ఇద్దరం కలిసి ఒక సినిమా చేసి, ఒకే స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది కోరిక. ఆ కోరిక కూడా తీరిపోతే బాగుంటుంది. ఇప్పటికీ మల్టీస్టారర్ టాపిక్ వస్తే వెంకీతో సినిమా చేయమని నాకు చాలామంది చెబుతుంటారు” నాని వెర్షన్ ఇది.

నిజానికి మల్టీస్టారర్ అనగానే ఎవరికైనా వెంకీనే గుర్తొస్తారు. మంచి స్టోరీ సెట్ అయితే మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెంకీకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే ఈసారి మాత్రం వెంకీ సైలెంట్ అయిపోయాడు. తనతో కలిసి ఓ సినిమా చేయాలని ఉందని నాని ఓపెన్ గా అడిగినప్పటికీ.. వెంకీ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. నవ్వేసి ఊరుకున్నాడు.

First Published:  16 April 2019 6:00 AM GMT
Next Story