తెల్ల వెంట్రుకలు దాచనని చెబుతున్న యువహీరో

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు నాని. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూ లతో బిజీగా ఉన్న నాని ఈ సినిమా ఒక ఎమోషనల్ మ్యాజిక్ అని చెబుతున్నాడు.

ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో నాని ఒక మధ్యవయస్కుడు పాత్రలో కనిపించబోతున్నాడని నానికి ఒక రెండేళ్ల కొడుకు కూడా ఉంటాడని తెలుస్తోంది. ఈ విషయమై ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యాడు నాని. “దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తాను” అని అంటున్నాడు నాని.

అంతేకాకుండా తనకు ఇప్పుడిప్పుడే కొంచెం తెల్ల వెంట్రుకలు కూడా వస్తున్నాయని కానీ దాన్ని దాచి పెట్టే ప్రయత్నాలు చేయనని కరాఖండిగా చెబుతున్నాడు నాని. ఇప్పటిదాకా తెల్ల వెంట్రుకలతో నటించే ధైర్యం చేసిన యువ హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ నాని మాత్రం తన తర్వాత సినిమాల కోసం కూడా తన తెల్ల వెంట్రుకలు దాచనని చెప్పేస్తున్నాడు. ఈ చిత్ర దర్శకుడు గౌతం గురించి మాట్లాడుతూ అతను నిజమైన దర్శకుడు అని చెప్పుకొచ్చాడు నాని.