సాయి పల్లవి నిర్ణయం…. వాళ్ళు షాక్ అయ్యారట!

సాయి పల్లవి.. తెలుగు, తమిళ్, మలయాళం సినిమా పరిశ్రమల్లో ఒక సినిమా తర్వాత మరొక సినిమా చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. తాను చేసిన చిత్రాలు పెద్దగా విజయం సాధించనప్పటికీ, తాను ఎంచుకున్న పాత్రలకు మాత్రం పూర్తిగా న్యాయం చేస్తుంది సాయి పల్లవి.

ఇటీవలే రౌడీ బేబీ పాట తో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన పల్లవి ప్రస్తుతం రానా తో తన తదుపరి చిత్రం షూటింగ్ కోసం ఎదురుచూస్తోంది. తాజా ఫిలిం నగర్ కబుర్ల ప్రకారం ఒక మల్టీ నేషనల్ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాన్డ్ సంస్థ మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్న ఒక కొత్త ఫెయిర్ నెస్ క్రీమ్ ని ప్రమోట్ చేసేందుకు సాయి పల్లవి తో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలని…. దీనికి రెండు కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వనున్నట్లు సాయి పల్లవిని సంప్రదించారట.

అయితే సాయి పల్లవి ఈ ప్రపోజల్ విన్న వెంటనే చేయలేను అని చెప్పేసిందట. దీనికి కారణం …. స్వతహాగా సాయి పల్లవి గ్లామర్ కి పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చే హీరోయిన్ కాదు. తన సినిమాల్లో కూడా చాలా తక్కువ మేకప్ వేసుకొనే సాయి పల్లవి… క్రీమ్ ని ఎండార్స్ చేస్తూ ప్రమోషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పిందట. అందుకే రెండు కోట్లు ఇచ్చినా చేయలేనని తెగేసి చెప్పేసిందట. దీంతో ఇంత పెద్దమొత్తంలో పారితోషికం ఇస్తున్నా చేయలేనని చెప్పడంతో వాళ్ళు షాక్ అయ్యారట!