“జై నాని అన్నా” అనేసిన హీరోయిన్

శ్రద్ధ శ్రీనాథ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ కన్నడ సినిమా యు టర్న్ లో నటించి అందరి ప్రశంసలు అందుకున్న హీరోయిన్. త్వరలో నాని సినిమా జెర్సీ తో అరంగేట్రం చేయనున్న ఈ హీరోయిన్ సౌత్ ఇండియా లో బిజీ గా ఉన్న నటీమణుల్లో ఒకరు.

అయితే నిన్న జెర్సీ సినిమా ఆడియో లాంచ్ సందర్భం గా ఆమె చేసిన వ్యాఖ్యలు… ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేశాయి. నిన్న ఫంక్షన్ లో శ్రద్ధ మాట్లాడుతూ డైరెక్టర్ ని పొగడ్తలతో ముంచెత్తింది.

అయితే అదే సమయంలో నాని అభిమానులు శ్రద్ధ ని మాట్లాడనివ్వకుండా ఈలలు, కేకల తో అల్లరి చేశారు. ఎవరైనా వేరే విధం గా స్పందిస్తారేమో కానీ శ్రద్ధ వెంటనే…. “జై నాని అన్నా” అనేసింది. ఒక్కసారిగా ఆ మాటలు విన్న అభిమానులు ఖంగు తిన్నారు. అయితే ఒక హీరోయిన్ తాను నటించిన హీరో ని అన్నయ్య అని పిలిచిన దాఖలాలు చాలా తక్కువ. ఇలా సడన్ గా అనేసరికి అభిమానులు షాక్ అయ్యారు.

అంతే కాకుండా శ్రద్ధ మాట్లాడుతూ తన పేరు ని అందరూ తప్పుగా పలుకుతారు అని, అందుకే అందరూ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలని చెప్పి తన స్పీచ్ ముగించింది.