Telugu Global
Cinema & Entertainment

18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన సీత

హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు అస్సలు మార్కెట్ లేదు. అతడు నటించిన కవచం సినిమా డిజాస్టర్ అయింది. అంతకంటే ముందు చేసిన సాక్ష్యం సినిమా ఫ్లాప్ అయింది. ఈ రెండు సినిమాలు బయ్యర్లను నష్టాల పాల్జేశాయి. అయినప్పటికీ అతడి సినిమాలు భారీ రేటుకు అమ్ముడుపోతూనే ఉంటాయి. అదే ఇక్కడ విచిత్రం. సీత సినిమా కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ సినిమా హక్కులు ఏకంగా 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఏపీ, నైజాం ప్రాంతాలకు సంబంధించి ఈ […]

18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన సీత
X

హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు అస్సలు మార్కెట్ లేదు. అతడు నటించిన కవచం సినిమా డిజాస్టర్ అయింది. అంతకంటే ముందు చేసిన సాక్ష్యం సినిమా ఫ్లాప్ అయింది. ఈ రెండు సినిమాలు బయ్యర్లను నష్టాల పాల్జేశాయి. అయినప్పటికీ అతడి సినిమాలు భారీ రేటుకు అమ్ముడుపోతూనే ఉంటాయి. అదే ఇక్కడ విచిత్రం. సీత సినిమా కూడా ఇందుకు మినహాయింపు కాదు.

ఈ సినిమా హక్కులు ఏకంగా 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఏపీ, నైజాం ప్రాంతాలకు సంబంధించి ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను 18 కోట్ల రూపాయలకు హోల్ సేల్ గా దక్కించుకున్నాడు అభిషేక్ అగర్వాల్. అంటే సినిమాను కనీసం 20 కోట్ల రూపాయలకైనా అమ్మాలి. అంటే.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సినిమాకు కనీసం 22 కోట్ల రూపాయలైనా రావాలి. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది.

22 కోట్ల రూపాయల వసూళ్లు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. మరీ ముఖ్యంగా కవచం లాంటి సినిమా తర్వాత 22 కోట్లతో బ్రేక్-ఈవెన్ అవ్వాలంటే అది తలకుమించిన భారం అవుతుంది. ఇప్పుడున్నది కేవలం కొన్ని పాజిటివ్ అంశాలు మాత్రమే. ఒకటి తేజ్ దర్శకత్వం, రెండోది హీరోయిన్ కాజల్, మూడోది సమ్మర్ సీజన్. ఈ మూడు ఎలిమెంట్స్ కలిసొస్తే సినిమా బ్రేక్-ఈవెన్ అవుతుంది. లేదంటే బెల్లంకొండ ఖాతాలో మరో ఫ్లాప్ జమ అవుతుంది.

First Published:  15 April 2019 9:13 PM GMT
Next Story