Telugu Global
Cinema & Entertainment

కేరళ అడవుల్లో సైరా విన్యాసాలు

చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ కేరళలో మొదలైంది. కేరళలోని అడవుల్లో ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. గొరిల్లా యుద్ధ నీతి ఆధారంగా, చెట్ల మధ్య దాక్కొని శత్రువులపై విరుచుకుపడే సన్నివేశాల్ని ఇక్కడ తీస్తున్నారు. 10 రోజుల పాటు కేరళ షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో చిన్న షెడ్యూల్ ఉంటుంది. దీంతో సైరా సినిమా టోటల్ షూటింగ్ కంప్లీట్ […]

కేరళ అడవుల్లో సైరా విన్యాసాలు
X

చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ కేరళలో మొదలైంది. కేరళలోని అడవుల్లో ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. గొరిల్లా యుద్ధ నీతి ఆధారంగా, చెట్ల మధ్య దాక్కొని శత్రువులపై విరుచుకుపడే సన్నివేశాల్ని ఇక్కడ తీస్తున్నారు.

10 రోజుల పాటు కేరళ షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో చిన్న షెడ్యూల్ ఉంటుంది. దీంతో సైరా సినిమా టోటల్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత గ్రాఫిక్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ప్రారంభిస్తారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రకు కాస్త ఫిక్షన్ జోడించి తెరకెక్కుతోంది సైరా. రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. వేసవి చివర్లో మూవీని విడుదల చేస్తామని గతంలో చరణ్ ప్రకటించినప్పటికీ అది సాధ్యం కాలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత కొత్తగా విడుదల తేదీని ప్రకటిస్తారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా టైమ్ లో సైరా ను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో తమన్న కనిపించనుంది. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోంది సైరా నరసింహారెడ్డి.

First Published:  16 April 2019 7:00 AM GMT
Next Story