తమన్న చెబితేనే ప్రభాస్ ఆ పని చేశాడంట!

రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంటరయ్యాడు ప్రభాస్. జస్ట్ ఎకౌంట్ క్రియేట్ చేసుకున్నాడంతే. ఎలాంటి పోస్టులు పెట్టలేదు. అయినప్పటికీ ప్రభాస్ ఎకౌంట్ కు ఏకంగా 7 లక్షల ఫాలోవర్స్ వచ్చి చేరారు. నిన్నంతా ఈ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ కు ఈ క్రేజ్ అంతా రావడానికి కారణం నేనే అంటోంది హీరోయిన్ తమన్న.

అవును.. తన సలహా మీదటే ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లోకి వచ్చాడంటోంది మిల్కీబ్యూటీ. ఇన్ స్టాగ్రామ్ లోకి రమ్మని బాహుబలి టైమ్ నుంచి ప్రభాస్ ను కోరుతోందట ఈ బ్యూటీ. రీసెంట్ గా కూడా ఓ సందర్భంలో కలిస్తే ఇదే విషయం చెప్పిందట. అందుకే మిల్కీబ్యూటీ మాట కాదనలేక ప్రభాస్ ఈ ఎకౌంట్ ఓపెన్ చేశాడట.

ఇది తమన్న చెబుతున్న వెర్షన్. కానీ ప్రభాస్ ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేయడానికి ఓ రీజన్ ఉంది. త్వరలోనే అతడు నటించిన భారీ బడ్జెట్ సినిమా సాహో విడుదలకానుంది. ఉత్తరాదిన ఎక్కువమంది ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులున్నారు. వాళ్లను కూడా చేరేందుకు ప్రభాస్ ఇలా ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంటరయ్యాడు. ఇకపై ఫేస్ బుక్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లో కూడా సాహో అప్ డేట్స్ పెడతాడట. అదీ సంగతి.