ప్రపంచ గోల్ఫ్ లో తిరిగి టైగర్ వుడ్స్ హవా

  • 14 ఏళ్ల విరామం తర్వాత మేజర్ టైటిల్ నెగ్గిన టైగర్ వుడ్స్
  • కెరియర్ లో 15వ మేజర్ టైటిల్ నెగ్గిన టైగర్ వుడ్స్
  • వివాహేతర సంబంధాలతో గోల్ఫ్ కు దూరమైన టైగర్ వుడ్స్

గ్లోబల్ గేమ్ గోల్ఫ్ ఆల్ టైమ్ గ్రేట్, అమెరికన్ వివాదాస్పద గోల్ఫర్ టైగర్ వుడ్స్…14 ఏళ్ల విరామం తర్వాత ఓ ప్రధాన టైటిల్ సాధించడం ద్వారా సంచలనం సృష్టించాడు.

43 ఏళ్ల వయసులో ఐదోసారి మాస్టర్స్ టైటిల్ సాధించిన గోల్ఫర్ గా రికార్డుల్లో చేరాడు. గత ఐదేళ్ల కాలంలో టైగర్ వుడ్స్ సాధించిన తొలి మేజర్ టైటిల్ ఇదే కావడం విశేషం.

టైగర్ వుడ్స్..మాస్టర్స్ ఫైనల్ రౌండ్ ఆడుతున్న సమయంలో.. 23 లక్షల 60 వేల డాలర్ల విలువైన…వివిధ కంపెనీల యాడ్లను ప్రసారం చేయడం ఓ రికార్డుగా అమెరికన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

 టైగర్ వుడ్స్ ఈ అరుదైన విజయంతో…స్పాన్సర్లు గాల్లో తేలిపోతున్నారు. ఈ విజయంతో టైగర్ వుడ్స్ కెరియర్ లో 15 ప్రపంచ ప్రధాన టైటిల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ప్రపంచగోల్ఫ్ చరిత్రలో అత్యధికంగా 18 మేజర్ టైటిల్స్ సాధించిన ఆటగాడి రికార్డు జాక్ నికోలస్ పేరుతో ఉంది. వివాహేతర సంబంధాలు, ఆరోగ్యసమస్యలతో గోల్ఫ్ కెరియర్ ను చేజేతులా నాశనం చేసుకొన్న టైగర్ వుడ్స్…పూర్వవైభవం కోసం పోరాడుతున్నాడు.