విజయ్ సినిమాలో…. సీరియల్ నటి

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా సౌత్ ఇండియాలో స్టార్ హీరో అయిపోయాడు. నటుడిగానే కాక విజయ్ తనని తాను మార్కెటింగ్ చేసుకోవడం లో ఎప్పటికప్పుడు కొత్త గా కనిపిస్తాడు.

అయితే ఇక ఇండస్ట్రీ లో మరో మెట్టు ఎక్కాలన్న ఆలోచనతో ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తాడు. అందులో భాగంగా ‘కింగ్ ఆఫ్ హిల్’ బ్యానర్ పై తన మొదటి సినిమా నిర్మాణం ప్రారంభం చేశాడు.

దర్శకుడు తరుణ్ భాస్కర్, అనసూయ జంటగా నటిస్తున్న ఈ చిత్రం లో మరొక నటి కి అవకాశం ఇచ్చాడు దేవరకొండ. వాని అనే తమిళ్ సీరియల్ నటి కి ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్ర ని కేటాయించాడట. వాని నటన మెచ్చి విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

వాని ఇప్పటికే తమిళ్ బుల్లి తెర పై అగ్రగామి నటి గా చెలామణి అవుతుంది. ఈ సినిమా తో టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. తమిళ్ షార్ట్ ఫిలిమ్ మేకర్ సంజీవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.