Telugu Global
NEWS

ప్రభుత్వం మారబోతోంది.... నిబంధనలకు విరుద్దంగా పనిచేయం

అధికారుల సహాయ నిరాకరణ అనుకున్నట్టే అయ్యింది. దేశవ్యాప్తంగా జాతీయ మీడియా సర్వేలు చెబుతున్నదే నిజమవుతుందా.? ఏపీలో అధికారం మారడం ఖాయమా.? అధికారులు టీడీపీ మంత్రులకు, నేతలకు తాజాగా షాక్ ఇవ్వడం చూశాక…. ఆంధ్రాలో ప్రభుత్వం మారడం ఖాయమన్న సంకేతాలకు బలం చేకూరుతోంది. ఏపీలో ఎన్నికలు ముగిశాక విజయం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఫలితాలకోసం మే 23వరకూ కూడా అందరూ ఎదురుచూడాల్సిన పరిస్థితి. తమ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ గుబులు చెందుతోంది. […]

ప్రభుత్వం మారబోతోంది.... నిబంధనలకు విరుద్దంగా పనిచేయం
X

అధికారుల సహాయ నిరాకరణ అనుకున్నట్టే అయ్యింది. దేశవ్యాప్తంగా జాతీయ మీడియా సర్వేలు చెబుతున్నదే నిజమవుతుందా.? ఏపీలో అధికారం మారడం ఖాయమా.? అధికారులు టీడీపీ మంత్రులకు, నేతలకు తాజాగా షాక్ ఇవ్వడం చూశాక…. ఆంధ్రాలో ప్రభుత్వం మారడం ఖాయమన్న సంకేతాలకు బలం చేకూరుతోంది.

ఏపీలో ఎన్నికలు ముగిశాక విజయం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఫలితాలకోసం మే 23వరకూ కూడా అందరూ ఎదురుచూడాల్సిన పరిస్థితి. తమ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ గుబులు చెందుతోంది. చంద్రబాబు దేశమంతా పర్యటించి ఈవీఎంలలో అక్రమాలు జరిగాయంటూ ఓటమి భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్ మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు. వైసీపీ గెలుపుపై రెట్టింపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార టీడీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ తగులుతోంది.

తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ తమ పనులు చేసిపెట్టాల్సిందిగా సంబంధిత అధికారులను పురమాయిస్తుంటే వారు అస్సలు చేయడం లేదట… పనులు చేయకపోగా మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళపై ఎంత ఒత్తిడి తెస్తున్నా, రూల్స్‌కు విరుద్దంగా ఏ పనీ చేయమని నిష్కర్షగా చెబుతున్నట్టు తెలుస్తోంది.

పైగా అధికారులు టీడీపీ ప్రజాప్రతినిదులతో సున్నితంగా మాట్లాడుతూనే నిర్మొహమాటంగా ఉంటున్నారట. మే 23తో ప్రభుత్వం మారుతుందని, మీ ఒత్తిడికి లొంగి నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తే ఆ తరువాత మేము ఇబ్బందులు పడాల్సి ఉంటుందని, ఈ ఐదేళ్ళు ప్రభుత్వానికి అడ్డగోలుగా సహకరించిన అధికారులే చాలా భయపడుతున్నారని, వివాదాల్లో ఇరుక్కోవడం తమకు ఇష్టం లేదని చెబుతున్నారట.

ఇలా అధికారుల తీరుతో మంత్రులకు దిమ్మదిరిగిపోతోందట.. వెంటనే ఈ విషయాన్ని వీళ్ళు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం.

First Published:  16 April 2019 7:02 PM GMT
Next Story