Telugu Global
NEWS

హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ లో కీలక సమరం

సన్ రైజర్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ గండం రాజీవ్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు కీ ఫైట్ చెన్నై జట్టులో అంబటి రాయుడు… హైదరాబాద్ జట్టులో విజయ్ శంకర్ ఐపీఎల్ 12వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ షో….మరోసారి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి చేరింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక సమరం డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు చెలగాటం……ఆతిథ్య హైదరాబాద్ సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్ సంకటంగా […]

హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ లో కీలక సమరం
X
  • సన్ రైజర్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ గండం
  • రాజీవ్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు కీ ఫైట్
  • చెన్నై జట్టులో అంబటి రాయుడు… హైదరాబాద్ జట్టులో విజయ్ శంకర్

ఐపీఎల్ 12వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ షో….మరోసారి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి చేరింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక సమరం డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు చెలగాటం……ఆతిథ్య హైదరాబాద్ సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్ సంకటంగా మారింది.

ఇప్పటి వరకూ ఆడిన ఏడురౌండ్ల పోటీలలో సన్ రైజర్స్ మూడు విజయాలు, నాలుగు పరాజయాల రికార్డుతో ఉంది. కేవలం ఆరు పాయింట్లు మాత్రమే సాధించి…లీగ్ టేబుల్ ఆరోస్థానంలో కొనసాగుతోంది.

మరోవైపు…చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిదిరౌండ్లలో ఏడు విజయాలు, 14 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

అటు రాయుడు- ఇటు విజయ్ శంకర్….

చెన్నై తరపున హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు నంబర్ ఫోర్ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతుంటే…హైదరాబాద్ తరపున చెన్నై ఆటగాడు విజయ్ శంకర్ రెండోడౌన్ స్థానంలో బ్యాటింగ్ చేయనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ రెండుజట్లూ ఇప్పటి వరకూ పదిసార్లు తలపడితే చెన్నై 8 విజయాలు, హైదరాబాద్ 2 విజయాల రికార్డుతో ఉన్నాయి.

సన్ రైజర్స్ పై చెన్నై సూపర్…..

వీవో ఐపీఎల్ లో…హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రత్యర్థిగా …డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు తిరుగులేని రికార్డు ఉంది. గత 12 సీజన్లలో ఇప్పటి వరకూ… హైదరాబాద్ తో 10సార్లు తలపడిన సూపర్ కింగ్స్.. 8 విజయాలు, 2 పరాజయాల రికార్డుతో ఉంది.

సన్ రైజర్స్ తో ఆడిన గత నాలుగుకు నాలుగుమ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించిన రికార్డుకు సూపర్ కింగ్స్ కు ఉంది.

రాజీవ్ స్టేడియంలో 2 విజయాలు

అంతేకాదు…హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా….సన్ రైజర్స్ తో ఆడిన గత మూడు మ్యాచ్ ల్లో సూపర్ కింగ్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది.

మరోవైపు…హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియం వేదికగా 2015లో మాత్రమే… చెన్నై సూపర్ కింగ్స్ పైన విజయం సాధించిన రికార్డు హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఉంది.

మరికాసేపట్లో చెన్నై తో జరిగే పోటీలో నెగ్గితేనే…ప్లే ఆఫ్ రౌండ్ అవకాశాలను సన్ రైజర్స్ సజీవంగా నిలుపుకోగలుగుతుంది.

First Published:  17 April 2019 8:11 AM GMT
Next Story