Telugu Global
Cinema & Entertainment

కాజల్ చేతిలో రెండు సినిమాలే !

‘లక్ష్మీకళ్యాణం’ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ లలో ఒకరని తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో గత 12 ఏళ్లుగా స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈమె దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకుంది. అయితే గత కొంతకాలంగా ఈమెకు ఆఫర్లు తగ్గి పోయాయన్న వార్తలు వస్తున్నాయి. ఈమె చేతిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉండటం దానికి ఉదాహరణ. తెలుగు […]

కాజల్ చేతిలో రెండు సినిమాలే !
X

‘లక్ష్మీకళ్యాణం’ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ లలో ఒకరని తెలిసిందే.

తెలుగు, తమిళ భాషల్లో గత 12 ఏళ్లుగా స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈమె దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకుంది.

అయితే గత కొంతకాలంగా ఈమెకు ఆఫర్లు తగ్గి పోయాయన్న వార్తలు వస్తున్నాయి. ఈమె చేతిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉండటం దానికి ఉదాహరణ.

తెలుగు లో కాజల్ అగర్వాల్ త్వరలో ‘సీత’ అనే సినిమాలో కనిపించబోతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో నటించిన ‘సీత’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

మరోవైపు తమిళంలో కాజల్ అగర్వాల్ ‘క్వీన్’ కు రీమేక్ అయిన ‘ప్యారిస్ ప్యారిస్’ లో నటిస్తోంది. ఈ సినిమా సమ్మర్ లో విడుదల కాబోతోంది.

ఇవి కాకుండా కాజల్ చేతిలో ఉన్నవి రెండే సినిమాలు. సుదీర్-శర్వానంద్ సినిమా, తమిళంలో జయం రవి తో ఒక సినిమా ఉన్నాయి. ఇవి పూర్తయితే కాజల్ చేతిలో సినిమాలు ఉండవు. ఇక ఈమెకు ఆఫర్లు కూడా పెద్దగా రావడం లేదని దానికి కారణం ఇండస్ట్రీలో పెరిగిపోయిన కొత్త హీరోయిన్లు అని టాక్ వినిపిస్తోంది.

First Published:  16 April 2019 7:02 PM GMT
Next Story