ఐపీఎల్ తొమ్మిదోరౌండ్లో కింగ్స్ పంజాబ్ కీలక విజయం

  • రాజస్థాన్ రాయల్స్ కు తప్పని ఆరో పరాజయం
  • అశ్విన్ ఆల్ రౌండ్ షోతో కింగ్స్ పంజాబ్ 12 పరుగుల గెలుపు

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తొమ్మిదోరౌండ్ మ్యాచ్ లో…కింగ్స్ పంజాబ్ కీలక విజయం సాధించింది.  మొహాలీ వేదికగా ముగిసిన పోటీలో…రాజస్థాన్ రాయల్స్ పై 12 పరుగుల విజయంతో… లీగ్ టేబుల్ నాలుగోస్థానంలో నిలిచింది.

ఈ కీలకమ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య పంజాబ్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగుల స్కోరు నమోదు చేసింది. 

రాహుల్ మరో హాఫ్ సెంచరీ….

ఓపెనర్ రాహుల్ 52 పరుగులు, మిల్లర్ 40 పరుగులు, కెప్టెన్ అశ్విన్ కేవలం నాలుగు బాల్స్ లోనే ఒక బౌండ్రీ, రెండు సిక్సర్లతో 17 పరుగులు సాధించారు.

సమాధానంగా 183 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్…20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.

 పంజాబ్ బౌలర్లలో అశ్విన్ , అర్షదీప్, షమీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్ రౌండ్ షోతో తనజట్టుకు కీలక విజయం అందించిన అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

తొమ్మిది రౌండ్లలో పంజాబ్ కు ఇది ఐదో గెలుపు కాగా…8 రౌండ్లలో రాజస్థాన్ రాయల్స్ కు ఆరవ పరాజయం కావడం విశేషం.