మహేష్ బాబుకి అడిక్ట్ అయిపోయానంటున్న నమ్రత

టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో మహేష్ బాబు, నమ్రత కూడా ఒకరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరి పెళ్లి అయ్యి ఇప్పటికీ చాలా కాలం అయినప్పటికీ వారిద్దరి మధ్య ప్రేమ రోజు రోజుకి పెరిగిందే తప్ప తగ్గలేదు.

తాజాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నమ్రత, మహేష్ బాబు కి సంబంధించిన ఒక మీమ్ షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

“డియర్ డ్రగ్స్. నాకు నీ అవసరం లేదు. నేను ఆల్రెడీ మహేష్ బాబుకి ఎడిక్ట్ అయిపోయాను” అని రాసి ఉన్న మీమ్ ని నమ్రత షేర్ చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ ఫోటోను షేర్ చేస్తూ “పర్పజ్ ఫుల్ క్రియేషన్” అంటూ కామెంట్ చేసింది నమ్రత. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. 2000 సంవత్సరంలో ‘వంశీ’ సినిమా సెట్స్ పై మహేష్ బాబు నమ్రత మొట్టమొదటిసారిగా కలుసుకున్నారు. అప్పుడే వారి ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా చిగురించింది.

2005లో పెళ్లి చేసుకున్న మహేష్ నమ్రత కు గౌతమ్, సితార… ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల పరంగా మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన ‘మహర్షి’ మే 9న విడుదల కానుంది. మహేష్ కెరీర్లో 25 వ చిత్రంగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.