టైటిల్ మార్చే ప్రసక్తే లేదు అంటున్న నాని

నాని హీరోగా ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించిన ‘జెర్సీ’ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే. శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నాని క్రికెటర్ పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాలో నాని నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ను విడుదల చేస్తూ ఒక వీడియో ని కూడా విడుదల చేశారు. ఆ వీడియో కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడమే కాక సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచింది.

అయితే ఈ టైటిల్ ను విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే సినిమా వివాదాల పాలయింది. ఒక దర్శకుడు ఆ సినిమా టైటిల్ ను తాము రిజిస్టర్ చేసుకున్నామని నిర్మాతల మండలి లో కంప్లైంట్ చేశాడు.

తాజాగా ఈ విషయమై నాని రియాక్ట్ అయ్యాడు. తమ సినిమాకు, కథ కు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని దానికి మించిన మంచి టైటిల్ ఇంకోటి దొరకదని చెప్పాడు. “సినిమా చూశాక ప్రేక్షకులే స్వయంగా ఈ చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ బాగుంటుందని అంటారు. ఒకవేళ సినిమా చూశాక ఈ టైటిల్ సెట్ అవ్వలేదు అని ఎవరైనా అంటే అప్పుడు కచ్చితంగా టైటిల్ మారుస్తానని” చెప్పుకొచ్చాడు నాని. సినిమా విడుదలయ్యాక టైటిల్ ఎలాగో మార్చలేరు కాబట్టి ఏదో ఫార్మాలిటీ కి నాని ఇలా చెబుతున్నాడు కానీ….. ఈ సినిమాకు టైటిల్ ను మార్చే ప్రసక్తే లేదని ఇండైరెక్టుగా హింట్ ఇచ్చాడు నాని.