Telugu Global
Cinema & Entertainment

'కేజిఎఫ్' నటుడిని వివాహం చేసుకున్న బిగ్ బాస్ భామ

‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘లా’, ‘త్రిపుర’ వంటి సినిమాలో కనిపించిన పూజా రామచంద్రన్ బిగ్ బాస్ తో బాగానే పాపులర్ అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షో లోకి ఎంటర్ అయిన ఈమె ప్రేక్షకులను బాగానే మెప్పించింది. తాజాగా పూజా రామచంద్రన్ తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కింది. గత కొంతకాలంగా పూజ, ప్రముఖ నటుడు అనీస్ కొక్కెన్ తో పీకల్లోతు ప్రేమ లో ఉంది. కొన్ని చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ లో నటించిన అనీష్ […]

కేజిఎఫ్ నటుడిని వివాహం చేసుకున్న బిగ్ బాస్ భామ
X

‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘లా’, ‘త్రిపుర’ వంటి సినిమాలో కనిపించిన పూజా రామచంద్రన్ బిగ్ బాస్ తో బాగానే పాపులర్ అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షో లోకి ఎంటర్ అయిన ఈమె ప్రేక్షకులను బాగానే మెప్పించింది.

తాజాగా పూజా రామచంద్రన్ తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కింది. గత కొంతకాలంగా పూజ, ప్రముఖ నటుడు అనీస్ కొక్కెన్ తో పీకల్లోతు ప్రేమ లో ఉంది. కొన్ని చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ లో నటించిన అనీష్ ఈ మధ్యనే ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ చిత్రాల్లో కూడా కనిపించాడు.

కేరళలో విషు పర్వదినం నాడు వీరి వివాహం జరిగింది. తన బెస్ట్ ఫ్రెండ్ ను తాను వివాహం చేసుకున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమె ఫొటోని పోస్ట్ చేసింది. ఫొటో చూస్తే వీరిద్దరి వివాహం కేరళ సాంప్రదాయం ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు పూజా రామచంద్రన్ ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లాడి విడాకులు తీసుకుంది. అనీష్ కి కూడా ఇది రెండవ పెళ్లి అని సమాచారం.

https://www.instagram.com/p/BwTQ3wWJax7/

First Published:  17 April 2019 4:47 AM GMT
Next Story