సమంత పై గుర్రు గా ఉన్న అభిమానులు

అక్కినేని దంపతులు నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం లో వచ్చిన మజిలీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని… చిత్ర యూనిట్ ఒక సక్సెస్ మీట్ ని జరుపుకుంది.

అయితే వేడుకి సమంత రాకుండా…. వచ్చిన అభిమానులకి ఒక ఊహించని షాక్ ఇచ్చింది. ఎన్నో ఆశల తో సమంత ని చూడాలి అని వచ్చిన అభిమానులు సమంత రాకపోవడం తో నిరాశ తో వెనుదిరగడమే కాకుండా ఇప్పుడు వారు కోపంగా కూడా ఉన్నారు. సినిమాలో మరో హీరోయిన్ దివ్యాన్షా ఈ వేడుక కి హాజరైంది… కానీ సమంత మాత్రం రాలేదు.

మీడియా లో ఈ విషయమై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నా…. చిత్ర వర్గాలు మాత్రం షూటింగ్స్ తో బిజీ గా ఉండడం వలన మాత్రమే సమంత రాలేకపోయింది అని చెప్తున్నారు. నాగ చైతన్య కూడా తన స్పీచ్ లో సమంత గురించి మాట్లాడకపోవడం అభిమానులని మరింత నిరాశ కి గురి చేసిందని అంటున్నారు.