నాని, సుధీర్ సినిమాకి…. బాలీవుడ్ సంగీత దర్శకుడు

నాని, సుధీర్ బాబు ఇద్దరూ కలిసి త్వరలో ఒక చిత్రం లో నటించనున్నారు. ఈ ఇద్దరు హీరోలకి కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ అందించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కి సంబంధించిన వార్తలు చాలా కాలం గా మీడియా లో చక్కర్లు చేస్తున్నాయి.

తాజాగా సినిమా యూనిట్ హీరోయిన్స్ ను, సంగీత దర్శకుడిని ఫైనల్ చేశారు అని తెలుస్తోంది. జూలై మొదటి వారం లో మొదలు కానున్న ఈ చిత్రం లో నివేతా థామస్, అదితి రావ్ హైదరి లను ఎంపికైనట్లు సమాచారాం. వీరు ఇరువురు ఇప్పటికే మోహన్ కృష్ణ దర్శకత్వం లో నటించడం జరిగింది.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ కంపోసర్ ని అప్రోచ్ అయ్యాడట దర్శకుడు. సైరా నరసింహా రెడ్డి తో తెలుగు లో కి అడుగు పెడుతున్న అమిత్ త్రివేది ని ఈ సినిమా కి తీసుకున్నారు అని ఫిలిం నగర్ టాక్. అమిత్ త్రివేది కి తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది కనుక ఖచ్చితంగా ఇది వర్క్ అవుట్ అయ్యే ఆప్షన్ అని చెప్పచ్చు. అదే కాకుండా అమిత్ ప్రభాస్ సినిమాకి కూడా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.