మహేష్ సినిమా తో బండ్ల గణేష్ సెకండ్ ఇన్నింగ్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ చిత్రం మహర్షి ని పూర్తి చేసుకొని సినిమా ప్రచారాన్ని ప్రారంభించే పనుల్లో ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు.

ఈ సినిమా కి సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, సినిమా మాత్రం అధికారికం గా కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇంతకు ముందు ఈ సినిమా లో ఉపేంద్ర, విజయ శాంతి ముఖ్య పాత్రలు పోషించనున్నారు అని వార్తలు వచ్చాయి. విజయ శాంతి మౌనం గా ఉన్నా ఉపేంద్ర మాత్రం తన డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా వదులుకున్నట్లు ప్రకటించాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టనున్నాడు అని తెలుస్తుంది. నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన బండ్ల గణేష్ నిర్మాత గా మారాక పెద్దగా సినిమాలు ఏమి చెయ్యలేదు. అయితే తన లాస్ట్ సినిమా బిజినెస్ మాన్.

ఇప్పుడు మళ్ళి మహేష్ బాబు చిత్రం తోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కానుంది.