Telugu Global
Health & Life Style

సబ్జాగింజలు.... తక్కువ ఖర్చు.... ఎక్కువ ఆరోగ్యం....

పిట్ట కొంచెం… కూత ఘనం.. సబ్జాగింజలు కూడా అంతే… చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా.. ఈ మొక్క తులసి జాతికి చెందింది. అందుకే తులసి విత్తనాలు… సబ్జా గింజలు కూడా ఒకేలా ఉంటాయి. వీటిని ఇంగ్లీష్ లో బాసిల్ సీడ్స్ (basil seeds) అంటారు. ఇవి చూడడానికి ఆవాల్లా ఉంటాయి… నీళ్లలో వేస్తే సగ్గుబియ్యంలా మారతాయి…. సబ్జా గింజల ప్రధాన గుణం వేడిని తగ్గించడం. అందుకే వీటిని  వేసవి కాలంలో […]

సబ్జాగింజలు.... తక్కువ ఖర్చు.... ఎక్కువ ఆరోగ్యం....
X

పిట్ట కొంచెం… కూత ఘనం.. సబ్జాగింజలు కూడా అంతే… చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా.. ఈ మొక్క తులసి జాతికి చెందింది. అందుకే తులసి విత్తనాలు… సబ్జా గింజలు కూడా ఒకేలా ఉంటాయి. వీటిని ఇంగ్లీష్ లో బాసిల్ సీడ్స్ (basil seeds) అంటారు. ఇవి చూడడానికి ఆవాల్లా ఉంటాయి… నీళ్లలో వేస్తే సగ్గుబియ్యంలా మారతాయి….

  • సబ్జా గింజల ప్రధాన గుణం వేడిని తగ్గించడం. అందుకే వీటిని వేసవి కాలంలో విరివిగా వాడతారు.
  • ఈ గింజల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడంతో సుఖ విరోచనం అవుతుంది. అంతే కాదు మలబద్దకాన్ని నివారిస్తుంది.
  • సాధారణంగా ఈ గింజలను ఫాలుడా… ఐస్ క్రీమ్స్…. ఇతర పానీయాలలో కలుపుకుని తాగుతారు.
  • వేసవి కాలంలో శరీరాన్ని చల్ల పరచడమే కాదు… ఈ కాలంలో వచ్చే సమస్యలను అడ్డుకుంటాయి ఈ సబ్జా గింజలు.
  • అజీర్ణంతో బాధపడే వారు ఈ గింజలను నాన పెట్టి నిమ్మరసంతో కలిపి తాగితే ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది.
  • ద్రాక్ష, ఆరెంజ్, పైనాపిల్ వంటి జ్యూస్ లలో సబ్జా గింజలు కలుపుకుని తాగితే వాటిలోని గుణాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
  • రాత్రి పడుకునే ముందు నాన పెట్టిన సబ్జాగింజలు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • వీటిలో ఉన్న ఫోలిక్ యాసిడ్ మహిళలలో రుతు క్రమాన్ని సరిజేస్తుంది.
  • శరీరంపై గాయలకు సబ్జాగింజల పేస్ట్ కు కొద్దిగా కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే ఆ గాయాలు త్వరగా మానిపోతాయి.
  • ఈ గింజలు తాగడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. అంతే కాదు శరీరానికి నూతన ఉత్సాహం… ఉల్లాసం కలుగుతుంది.
  • క్రీడాకారులు ఆటల సమయంలో ఎంతో అలసి పోతారు. వీరి శరీరం నుంచి నీరు చెమట రూపంలో బయటకు పోతుంది.. అలాంటప్పుడు సబ్జాగింజల నీరు తాగితే శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.
  • రక్తహీనతతో బాధపడేవారు తరచూ ఒక కప్పు సబ్జాగింజలు తీసుకుంటే కొత్త రక్తం పడి మంచి ఆరోగ్యంగా తయారవుతారు.
  • ఇందులో ఉన్న పోషకాలు, విటమిన్లు, ఐరెన్… ఇతర ఖనిజాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక రోగాలను నివారిస్తాయి.
  • ఎసిడిటీ… కడుపులో మంటతో బాధపడుతున్నవారు కొంచెం సబ్జాగింజలను నాన పెట్టుకుని అందులో కొద్దిగా పంచదార కలుపుకుని తాగితే కడుపులో మంట, ఎసిడిటీ వెంటనే మాయం అవుతుంది.
  • చేపలలో ఏ ఔషధ గుణాలైతే ఉన్నయో అవన్నీ కూడా సబ్జాగింజలలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
  • సబ్జాలు ఒక యాంటీ బయోటిక్ మెడిసిన్ లా పనిచేస్తాయి. శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను తొలగిస్తాయి.
  • శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు సబ్జాగింజలు కొద్దిగా అల్లం రసం, తేనేతో కలిపి తీసుకోవాలి. ఇవి రక్తాన్ని శుద్ది చేసి, చెడు కొలెస్ట్ర్రాల్ ను అదుపు చేస్తుంది.
  • ఇందులో క్యాలరీలు అతి తక్కువగా ఉంటాయి కాబట్టి ఎంత తిన్నాకూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్య నిపుణలు చెబుతున్నారు.
  • కొంతమందికి అతిగా తినే అలవాటు ఉంటుంది. అలాంటి వారు నానపెట్టిన సబ్జాగింజలను తింటే అతిగా తినే అలవాటు క్రమేపీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
First Published:  17 April 2019 8:30 PM GMT
Next Story