హీరోయిన్ గురించి క్లారిటీ ఇచ్చిన వెంకీ కుడుముల

‘శ్రీనివాస కల్యాణం’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నితిన్ ప్రస్తుతం ‘చలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘భీష్మ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

‘చలో’ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మీక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు అని ఇందులో రెండవ హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉంటుందని ఆ పాత్ర కోసం ‘హలో’, ‘చిత్రలహరి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కళ్యాణి ప్రియదర్శన్ కనిపించబోతుందని వార్తలు బయటకు వచ్చాయి.

తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు వెంకీ కుడుముల. నితిన్ హీరోగా నటిస్తున్న ‘భీష్మ’ సినిమాలో కేవలం రష్మిక మందన్న మాత్రమే హీరోయిన్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాము” అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు వెంకీ కుడుముల.

మరోవైపు కల్యాణి ప్రియదర్శన్ కూడా ఈ వార్తల పై రియాక్ట్ అయ్యింది. తన తదుపరి సినిమా గురించి తనంతట తానే త్వరలో క్లారిటీ ఇస్తానని ఈలోపల ఎలాంటి పుకార్లను నమ్మొద్దని తెలిపింది.