వైష్ణవ్ తేజ్ కోసం వినిపిస్తున్న మరొక హీరోయిన్ పేరు

మెగా హీరోల లిస్టులో కొత్తగా మరొక హీరో జాయిన్ అవుతున్న సంగతి తెలిసిందే. అతను ఎవరో కాదు సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమాను నిర్మిస్తున్నాయి.

సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. గత కొంత కాలంగా ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం బోలెడు పేర్లు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో తెలుగమ్మాయి మనీషా రాజ్…. వైష్ణవ్ తేజ్ తో రొమాన్స్ చేయబోతోందని వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లో మరొక కొత్త నటి పేరు వినిపిస్తోంది. ఆమె మలయాళ నటి దేవిక సంజయ్. ‘ఎంజన్ ప్రకాశం’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దేవికా సంజయ్ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది.

తాజాగా ఈమె వైష్ణవ్ తేజ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీకి సరిగ్గా సరిపోతుందని ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో చెప్పలేం.