Telugu Global
Cinema & Entertainment

కన్నడ ట్రైలర్.... దిల్ రాజు కి వార్నింగ్ బెల్ ఇచ్చిందా?

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష కృష్ణన్ కలిసి నటించిన ’96’ సినిమా ఎమోషనల్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ’99’ అనే టైటిల్ తో విడుదల కాబోతున్న కన్నడ రీమేక్ చిత్ర ట్రైలర్ విడుదలైంది. కన్నడ గోల్డెన్ సార్ గణేష్  సరసన భావన ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా […]

కన్నడ ట్రైలర్.... దిల్ రాజు కి వార్నింగ్ బెల్ ఇచ్చిందా?
X

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష కృష్ణన్ కలిసి నటించిన ’96’ సినిమా ఎమోషనల్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ’99’ అనే టైటిల్ తో విడుదల కాబోతున్న కన్నడ రీమేక్ చిత్ర ట్రైలర్ విడుదలైంది. కన్నడ గోల్డెన్ సార్ గణేష్ సరసన భావన ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కాబోతోంది.

అయితే తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుతోంది. కొందరు ట్రైలర్ యావరేజ్ అంటుంటే, మిగతవారు మాత్రం విజయ్ త్రిష ల మధ్య పండిన కెమిస్ట్రీ…. వీరి మధ్య బాలేదని, అసలు ఆ సినిమాలో ఉన్న ఫీల్ ఈ సినిమాలో కలగటంలేదని, ఆ ఎమోషన్ ఈ సినిమాలో వర్క్ ఔట్ అవ్వలేదు అని బోలెడు కారణాలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ’96’ తెలుగు రీమేక్ గా శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాణం లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ కన్నడ ’99’ ట్రైలర్ దిల్ రాజు కి వార్నింగ్ బెల్ లా మారింది. తమిళ్ లో ఉన్న ఫీల్… తెలుగు లో మిస్ అయితే సినిమా హిట్ అవ్వదు అని ఇండైరెక్టు గా దిల్ రాజుకు మెసేజ్ వెళ్ళిందని కొందరు అంటున్నారు.

First Published:  17 April 2019 11:34 PM GMT
Next Story