జెర్సీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అదే

రెగ్యులర్ ఫార్మాట్ లో అందరూ సినిమాలు చేస్తారు. కానీ ఓ సినిమా కోసం ప్రత్యేకంగా 3 నెలల పాటు ట్రయినింగ్ తీసుకొని మరీ సినిమా చేయాలంటే చాలామంది హీరోలు డ్రాప్ అవుతారు. నాని మాత్రం ముందుకొచ్చాడు. జెర్సీ కోసం ఏకంగా 80 రోజులు క్రికెట్ ప్రాక్టీస్ చేసి మరీ జెర్సీ మూవీ సెట్స్ పైకి వచ్చాడు. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి గల కారణాన్ని నిజాయితీగా చెప్పుకొచ్చాడు నాని.

ప్రయత్నం సిన్సియర్ గా ఉన్నప్పుడు విజయం తప్పకుండా వరిస్తుందంటున్నాడు నాని. జెర్సీ సినిమాకు ఇంత కష్టపడ్డానికి కారణం ఇదే అని తెలిపాడు. గతంలో భీమిలి కబడ్డీ జట్టు సినిమా కోసం చాలా కష్టపడ్డానని, అది మంచి విజయాన్ని, తనకు బ్రేక్ ను అందించిందని.. మరోసారి జెర్సీ అలాంటి బ్రేక్ ఇస్తుందనే కాన్ఫిడెన్స్ తో చేశానని చెప్పుకొచ్చాడు.

రీసెంట్ గా నానికి ఫ్లాప్ వచ్చింది. కేవలం అతడు కమర్షియల్ బాట పట్టడం వల్లనే ఫ్లాపులు వచ్చాయి. అందుకే తను మళ్లీ మూలాల్లోకి వెళ్లిపోయానని, కంప్లీట్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన జెర్సీ సినిమాకు ఓకే చెప్పానని అంటున్నాడు. ఒక విధంగా ఇది తన కెరీర్ లో మరో మలుపు అని భావిస్తున్నాడు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. ప్రపంచవ్యాప్తంగా రేపు థియేటర్లలోకి వస్తోంది జెర్సీ సినిమా. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.