Telugu Global
NEWS

కేసీఆర్ బయోపిక్ ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

మొన్నటికి మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు మరో బయోపిక్ పై ఫోకస్ పెట్టాడు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ జీవితాన్ని సినిమాగా తీసుకురాబోతున్నాడు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించాడు వర్మ. కేసీఆర్ పై తీయబోయే చిత్రానికి టైగర్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు వర్మ. ఆ పదానికి మధ్యలో కేసీఆర్ అనే అక్షరాల్ని పొందుపరిచాడు. ”ది అగ్రెసివ్ గాంధీ” అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. కేవలం […]

కేసీఆర్ బయోపిక్ ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ
X

మొన్నటికి మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు మరో బయోపిక్ పై ఫోకస్ పెట్టాడు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ జీవితాన్ని సినిమాగా తీసుకురాబోతున్నాడు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించాడు వర్మ.

కేసీఆర్ పై తీయబోయే చిత్రానికి టైగర్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు వర్మ. ఆ పదానికి మధ్యలో కేసీఆర్ అనే అక్షరాల్ని పొందుపరిచాడు. ”ది అగ్రెసివ్ గాంధీ” అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. కేవలం ట్యాగ్ లైన్ తో ఆగకుండా తన మార్క్ డైలాగ్ కూడా రిలీజ్ చేశాడు వర్మ. ”ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు” అనే డైలాగ్ ను కూడా విడుదల చేశారు.

సరిగ్గా ఇదే ఫార్ములాను గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కూడా ఉపయోగించాడు వర్మ. ”వాడు, నా పిల్లలు కలిసి నన్ను వెన్నుపోటు పొడిచారు” అనే డైలాగ్ ను వాడాడు. ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ కోసం ఈ డైలాగ్ ను వైరల్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

నిజానికి కేసీఆర్ బయోపిక్ జనాలకు కొత్తకాదు. ఇప్పటికే కేసీఆర్ రాజకీయ జీవితంపై ”ఉద్యమ సింహం” అనే సినిమా వచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ సినిమా విడుదలను నిలిపివేస్తే, యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. తర్వాత మీడియా ప్రతినిధులు ఉద్యమసింహం సీడీలు కూడా పంచారు. కానీ ఆ సినిమా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు వర్మ అదే కాన్సెప్ట్ తో కొత్త సినిమా తీయబోతున్నాడు.

First Published:  18 April 2019 5:50 AM GMT
Next Story