22 కోట్ల తో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ?

బాహుబలి సినిమా తరువాత దర్శకుడు రాజమౌళి…. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో తీస్తున్న చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ మొదలు పెట్టిన కొద్ది రోజులకే ఆగిపోయింది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అనుకున్న  డైసీ జోన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

ఈ సినిమాలో రెండో హీరోయిన్ ఆలియా భట్ తో…. మూడో షెడ్యూల్ ని అతి త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు దర్శక నిర్మాతలు.

అయితే ఫిలింనగర్ లో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం ఈ సినిమా లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ఏకంగా 22 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నారట. సినిమా మొత్తానికి, అలాగే తారక్ కెరీర్ మొత్తానికి ఈ ఇంట్రడక్షన్ సీన్ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని అంటున్నారు.

హాలీవుడ్ సినిమా లి లైఫ్ ఆఫ్ పై, జంగిల్ బుక్ వంటి చిత్రాలకి పనిచేసిన గ్రాఫిక్ నిపుణులు ఈ సినిమా కి కూడా పని చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తో ఆలియా భట్ తెలుగు లో తెరంగేట్రం చేస్తుంది. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత.