Telugu Global
NEWS

“దేశాన్ని” ముంచేది ఉద్యోగులేనా?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవుతుందని వార్తలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కొత్త మార్పులు రాబోతున్నాయని అంటున్నారు. ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టబోతోందని సర్వేలు చెబుతున్నాయి. గడచిన ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పట్ల ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని అంటున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ లో  కీలక ఓటర్లుగా పేరు తెచ్చుకున్న ఉద్యోగులు సైతం ఈసారి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని […]

“దేశాన్ని” ముంచేది ఉద్యోగులేనా?
X

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవుతుందని వార్తలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కొత్త మార్పులు రాబోతున్నాయని అంటున్నారు. ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టబోతోందని సర్వేలు చెబుతున్నాయి.

గడచిన ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పట్ల ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని అంటున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ లో కీలక ఓటర్లుగా పేరు తెచ్చుకున్న ఉద్యోగులు సైతం ఈసారి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖ, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగులు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని చెబుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించారని, తమ మాటకు ఎదురు చెప్పిన వారిని బదిలీల పేరుతో బెదిరించారని అంటున్నారు. ఐదు సంవత్సరాలుగా ఈ ఆగ్రహాన్ని, కోపాన్ని అణిచి పెట్టుకున్న ఉద్యోగులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కొందరు ఇసుక అక్రమ రవాణాతో పాటు తమతమ నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తమకు అనుకూలంగా మార్చాలంటూ అధికారులను బెదిరించే వారని చెబుతున్నారు. పోలీస్ శాఖకు చెందిన ఉద్యోగులు అయితే స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిన మాట వినడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అంటున్నారు.

కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని, ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎప్పటికప్పుడు తెలిసినా ఆయన మిన్నకుండి పోయారని ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు.

ఉపాధ్యాయులను కూడా బదిలీల పేరుతో స్థానిక ప్రజాప్రతినిధులు బెదిరించే వారని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ ఓట్లు కీలకమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  17 April 2019 11:13 PM GMT
Next Story